కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో సీపీఐ, అఖిల భారత కిసాన్ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్.దశరథ్ డిమాండ్ చేశారు. కొత్త పాసు పస్తకాలు, రైతుబంధు కూడా ఇవ్వాలని కోరారు.
సింగిరాయిపల్లిలో సర్వే నంబర్ 322లో గల 360 ఎకరాల భూమిని 100కు పైగా రైతులు సాగుచేసుకుంటే వారిని అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోడు భూములను పట్టాలు ఇవ్వకపోతే సీపీఐ ఆధ్వర్యంలో రాష్టవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్ఐకి వినతపత్రం సమర్పించారు.