ETV Bharat / state

Couple Murder Kamareddy : భర్తను కొట్టి.. భార్యకు ఉరేసి.. దారుణ హత్య.. దోపిడీ దొంగల పనేనా?

author img

By

Published : Jul 26, 2023, 10:19 AM IST

Updated : Jul 26, 2023, 11:18 AM IST

Couple Murder in Kamareddy : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్‌లో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. కిరాణా షాపు నిర్వాహకుడు నారాయణ దంపతులను దుండగులు హత్య చేశారు. భార్యను చీరతో ఉరేసి చంపగా.. భర్తను ఆయుధంతో కొట్టి హతమార్చారు.

Couple Murder
Couple Murder

Couple Murdere at Birkur : కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం రైతునగర్‌లో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ ఇంట్లో ఉన్న దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రైతునగర్‌కు చెందిన నారాయణ గుప్తా-సులోచనాదేవీ దంపతులు కిరాణా దుకాణం నడుపుతున్నారు. దంపతులు స్థానికంగా వడ్డీకి అప్పులిస్తుంటారు. రాత్రి భార్యాభర్తలు నిద్రిస్తుండగా... గుర్తుతెలియని వ్యక్తులు నిచ్చెన ద్వారా వెనుక నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. పడక గదిలో ఉన్న నారాయణపై దాడి చేసి, దారుణంగా హత్య చేశారు. సులోచనకు ఉరేసి చంపేశారు.

Couple Murder in Kamareddy : ఉదయం తొమ్మిది దాటినా ఆ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చింది. ఏమైందోనని తలుపు కొట్టారు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే నారాయణ రక్తపు మడుగులో పడి నిర్జీవంగా కనిపించాడు. సులోచనాదేవీకి ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. ముందుగా దంపతుల గురించి స్థానికంగా ఆరా తీశారు. నారాయణ-సులోచన దంపతులకు పిల్లలు కూడా లేకపోగా... కిరాణ దుకాణం, వడ్డీలకు డబ్బులిస్తూ జీవిస్తున్నారు. డబ్బుల కోసమే వీరిని ఎవరైనా హత్య చేశారా... అనే కోణంలో విచారణ సాగుతోందని పోలీసులు తెలిపారు.

Kamareddy Couple Murder : ఆ దుండగులు దొంగతనానికి వచ్చినట్లయితే నారాయణ గుప్తా ఇంట్లో విలువైన వస్తువులు, నగలు, డబ్బులు ఎత్తకెళ్లాలి.. కానీ, నిందితులు వాటిని తీసుకెళ్లకపోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇంట్లోని ఏ వస్తువులు చెల్లాచెదురుకాకుండా ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండడం గమనార్హం. వీరి వద్ద అప్పు తీసుకున్నవారే.. డబ్బు చెల్లించే అవసరం ఉండదనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఆరోపణలతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇందులో ఆత్మహత్య కోణం ఏమైనా ఉందేమోనని ఆ వైపుగానూ ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్​ను రంగంలోకి దించిన పోలీసులు వీలైనంత త్వరగా కేసు చేధిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 26, 2023, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.