ETV Bharat / state

తెరాస గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ - CONGRESS]

కాంగ్రెస్​కు మరో ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న జాజుల సురేందర్ తెరాసలోకి వెళ్లడం వల్ల ఇందూరు కాంగ్రెస్​లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు.

తెరాస గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్
author img

By

Published : Mar 28, 2019, 12:18 AM IST

Updated : Mar 28, 2019, 10:46 AM IST

తెరాస గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్
తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 9 మంది తెరాస తీర్థం పుచ్చుకోగా... ప్రస్తుతం ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ గులాబీ దళంలో చేరడానికి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ను కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే సురేందర్ కారెక్కుతారని వార్తలు వచ్చినప్పటికీ... ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వచ్చి... ఎట్టకేలకు గులాబీ దళంలో చేరారు.
కాంగ్రెస్​కు రాజీనామా చేస్తూ విడుదల చేసిన లేఖలో ఆ పార్టీ అధిష్ఠాన వైఖరిని తప్పు పట్టారు. త్వరలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... గులాబీ దళపతి​తో కలిసి నడుస్తానని వెల్లడించారు. మొదటి నుంచి తెరాసతో అనుబంధం ఉందని... కేసీఆర్​తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పుడు మరోసారి గులాబీ బాస్​తో కలిసి నడుస్తానని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:కారు దిగి... కాషాయం కప్పుకున్న జితేందర్​రెడ్డి

Intro:TG_SRD_36_27_zhb_trs_mp_candidate_g6
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థి ఎం పీ బి బి పాటిల్ బుధవారం నారాయణఖేడ్, కంగ్టి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మూడో ఫ్రంట్ ఆధ్వర్యంలో లో కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో లో నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Body:TG_SRD_36_27_zhb_trs_mp_candidate_g6

Conclusion:
Last Updated : Mar 28, 2019, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.