ETV Bharat / state

వీర సైనికుడా వందనం.. కామారెడ్డిలో నివాళి - వీర జవాన్​ కల్నల్​ సంతోశ్​ బాబు

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు వీరమణం పొందడం పట్ల కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్నల్ సంతోష్ బాబు సహా మరో ఇద్దరు సైనికులకు నివాళులు అర్పించారు.

Congress leaders pay tribute to Jawan Colonel Santosh Babu's death in Kamareddy district
వీర సైనికుడా వందనం.. కామారెడ్డిలో నివాళి
author img

By

Published : Jun 17, 2020, 3:45 AM IST

భారత్​-చైనా సరిహద్దులో జరిగిన కాల్పులో సూర్యాపేటకు చెందిన కల్నల్​ సంతోష్​​ బాబు వీరమరణం చెందాడు. అమరుడైన అతనికి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో కామప్ప కూడలి వద్ద కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

మాతృభూమి కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ అమరజవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వీరజవాన్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్​ హైమద్​, కార్యకర్తలు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.