ETV Bharat / state

హామీల అమలుపై ఎమ్మెల్యేను అడ్డుకున్న కాంగ్రెస్​ శ్రేణులు - ఎమ్మెల్యే జాజల సురేందర్​ను అడ్డుకున్న కాంగ్రెస్​ నాయకులు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్​ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్​ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై సమాధానం చెప్పాలంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పీఎస్​కు తరలించారు.

Congress leaders, yellareddy  MLA jajala surender
ఎమ్మెల్యే జాజల సురేందర్​ను అడ్డుకున్న కాంగ్రెస్​ నాయకులు
author img

By

Published : Mar 27, 2021, 5:43 PM IST

కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే జాజాల సురేందర్​కు చేదు అనుభవం ఎదురైంది. రెండేళ్లయినా నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్​ నాయకులు విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి వచ్చినా ఎమ్మెల్యేను కాంగ్రెస్ మండల అధ్యక్షులు అడ్డుకున్నారు. నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్​ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్​కు తరలించారు.

yellareddy  MLA jajala surender
పీఎస్​లో కాంగ్రెస్​ నాయకులు

అభివృద్ధి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ సమస్యలను వివరిస్తుంటే.. ఈయన మాత్రం నాగార్జున సాగర్​లోని తిరుమలసాగర్​లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి సీఎం కేసీఆర్ జన్మదినం రోజున తెరాసలో చేరారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినా హామీలు ఎందుకు నెరవేర్చలేదని కాంగ్రెస్​ నాయకులు ప్రశ్నించారు.

కాంగ్రెస్​ నాయకులను పీఎస్​కు తరలించిన పోలీసులు

ఇదీ చూడండి: ఖమ్మంలో కేటీఆర్​ పర్యటన మరోసారి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.