ETV Bharat / state

కేసీఆర్​ కహానీలు చెప్తున్నారు : షబ్బీర్ అలీ - కేసీఆర్​వి​ పిట్టల దొర కహానీలు

ముఖ్యమంత్రి కేసీఆర్ పిట్టల దొర కహానీలు చెప్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్​కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

Congress Leader Shabhir Ali fires on CM KCR
కేసీఆర్​వి​ పిట్టల దొర కహానీలు: షబ్బీర్ అలీ
author img

By

Published : May 6, 2020, 7:47 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ప్రజలకు సందేశాన్ని ఇస్తారని ఆశించామని.. కానీ పిట్టల దొర మాదిరిగా కహానీ చెప్పారన్నారు. ప్రతిపక్షం అయినా కరోనా సమయంలో ప్రధాని, సీఎం మాటలకు విలువ ఇచ్చి లాక్​డౌన్ నిబంధనలు పాటించామ‌న్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేలా మేమెప్పుడు మాట్లాడలేదని.. కానీ సీఎం మాత్రం కాంగ్రెస్ పార్టీపై అనేక విమర్శలు చేశార‌న్నారు.

ఛత్తీస్​ఘడ్ రాష్ట్ర మంత్రితో మాట్లాడటం జరిగిందని.. 11 వేల కోట్ల రూపాయల రుణమాఫీతో పాటు క్వింటాల్​ ధాన్యం రూ.2500 కొంటున్నట్లు మంత్రి చెప్పారని తెలిపారు. మీ బృందంతో కలిసి ఛత్తీస్​ఘడ్ రావాలని ఛాలెంజ్ చేశారు. యూత్ కాంగ్రెస్​లో ఉన్నప్పుడు పాస్​పోర్టు దందా చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో హుందాగా మాట్లాడితే బాగుంటుందని సూచించారు. కరోనా సమయంలో మీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.