కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామానికి చెందిన మహేశ్వరి, నితీశ్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో అమ్మాయిని వారి తల్లిదండ్రులు మందలించారు. సదరు వ్యక్తులు అబ్బాయిని కూడా మందలించడంతో ఆమెను పెళ్లి చేసుకోనని తెలిపాడు. దాంతో మనస్తాపానికి గురైన మహేశ్వరి ఏప్రిల్ 21 ఉరి వేసుకుని మరణించింది. అనంతరం నితీశ్ కూడా భయంతో ఏప్రిల్ 25 న బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కోపాద్రుక్తులైన నితీశ్ కుటుంబ సభ్యులు మహేశ్వరి ఇంటిపై ఏప్రిల్ 29న దాడి చేశారు. వారి మృతికి కారణం మీరు అంటే... మీరే అంటూ ఇరు వర్గాల వారు దాడి చేసుకున్నారు. దాడిలో చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని గొడవకు కారణమైన పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా గ్రామస్థుల సమక్షంలో మాట్లాడుకుంటామని తెలపడంతో వారిపై కేసు నమోదు చేయలేదని తెలిపారు.
ఇదీ చదవండి: జమున హేచరీస్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు