కామారెడ్డి జిల్లాలో డెంగీ(Dengue) వ్యాధి విస్తరిస్తోంది. జిల్లావ్యాప్తంగా చాలా మంది చిన్నారులు డెంగీ వ్యాధి బారిన పడుతున్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని టెక్రియాల్ గ్రామంలో ఆరేళ్ల వయస్సున్న రుషి అనే బాలుడు... దీనిబారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పది రోజుల క్రితం రుషి తీవ్ర అస్వస్థతకు గురికాగా... కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ జ్వరం తగ్గక పోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పది రోజులుగా రుషి చికిత్స పొందినా ఫలితం లేదు. బాలుని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: Dengue: ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి..