కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఎల్పుగొండ గ్రామంలో జిల్లాస్థాయి భూగర్భ జలాల రైతుల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే భూగర్భ జలాల వినియోగంపై అవగాహన కల్పించారు.
అవసరం లేకున్నా బోరు మోటర్ నుంచి నీటిని వృథాగా తోడేయవద్దని ఆయన సూచించారు. అధికంగా భూగర్భ జలాలు తోడేయడం వల్ల భవిష్యత్ తరాల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు.
ఇవీ చూడండి: పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్..