ETV Bharat / state

భర్త కోసం భార్య ధర్నా... బంధువులపై దాడి!

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్‌లో భర్త ఇంటి ముందు ధర్నా చేస్తున్న అరుణ బంధువులపై ఆమె భర్త బంధువు ప్రసాద్ దాడికి దిగారు. అరుణ బంధువులు ఆగ్రహించి ప్రసాద్‌పై దాడి చేశారు. తన కాపురాన్ని కూల్చవద్దని ప్రసాద్‌ను అరుణ వేడుకుంది.

attack-on-wifes-relatives-protesting-for-husband-at-ashok-nagar-in-kamareddy-district
భర్త కోసం ధర్నా చేస్తున్న భార్య బంధువులపై దాడి!
author img

By

Published : Jan 27, 2021, 8:11 PM IST

భర్త కోసం ధర్నా చేస్తున్న భార్య బంధువులపై దాడి!

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో పైడి నవీన్ ఇంటి ముందు ధర్నా చేస్తున్న భార్య పైడి అరుణ బంధువులపై భర్త నవీన్ తరఫు బంధువు ప్రసాద్ దాడికి దిగారు. అరుణ బంధువులు ఆగ్రహించి ప్రసాద్‌పై దాడి చేశారు. తన భర్త కోసం తాను ధర్నా చేస్తున్నానని... తన కాపురాన్ని కూల్చవద్దని ప్రసాద్‌ను అరుణ వేడుకుంది.

'ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం అని నమ్మించాడు. ఇరవై రోజుల్లోనే పెళ్లి తంతు అంతా పూర్తి చేశారు. ఓ ఆరు నెలలు బాగానే ఉన్నా... ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు. పిల్లలు పుట్టడం లేదని ఏకంగా నా భర్తకు మరో పెళ్లి చేయాలని చూస్తున్నారని' ఓ భార్య వాపోయింది. తన భర్త తనకే కావాలని కోరుతూ భర్త ఇంటి ముందే ధర్నా చేపట్టింది. ప్రాణం పోయినా అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పింది.

ఇదీ చదవండి: నా భర్తకు వేరే పెళ్లి చేస్తున్నారు... నాకే కావాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.