ETV Bharat / state

జవాన్ తండ్రి కిడ్నాప్.. ప్రత్యర్థులపై అనుమానం

author img

By

Published : Jul 3, 2019, 10:16 PM IST

Updated : Jul 3, 2019, 10:39 PM IST

భూవివాదాలతో ఓ ఆర్మీ జవాన్ తండ్రి కనిపించకుండా పోయాడు. ఒక్కడివి కన్పిస్తే కిడ్నాప్​ చేస్తామని ప్రత్యర్థి వర్గం బహిరంగంగా బెదిరించటంతో... వారిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ARMY SOLDIERS FATHER KIDNAP

దేశ ప్రజలకు రక్షణగా నిలిచే ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులకే రక్షణ లేకుండా పోతోందని ఓ భారత సైనికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన జవాన్ సప్పేటి స్వామి తన తండ్రి మూడు రోజులుగా కన్పించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్ది రోజులుగా తమ వ్యవసాయ భూమికి సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయని... పిప్పిరి ఆంజనేయులు తమ భూమిని పట్టా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 6 ఎకరాల భూమి గుండ్రెడ్డి సాయిరెడ్డి అక్రమంగా తనపేరిట మార్పిడి చేసుకున్నాడని... ఈ విషయమై 15 రోజుల క్రితం వాట్సాప్ గ్రూపులలో వీడియో పోస్ట్ చేశానని తెలిపాడు. తన తండ్రి ఒంటరిగా దొరికినప్పుడు కిడ్నాప్ చేస్తామని గుండ్రెడ్డి సంగారెడ్డి, ఆయన కుమారుడు రమేశ్​ రెడ్డి బహిరంగంగా బెదిరించారన్నాడు. పిప్పిరి ఆంజనేయులు, గుండ్రెడ్డి సంగారెడ్డి, రమేశ్​ రెడ్డిలపై అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు వెంటనే విచారించి న్యాయం చేయాలని స్వామి విజ్ఞప్తి చేశాడు.

జవాన్ తండ్రి కిడ్నాప్..ప్రత్యర్థులపై అనుమానం

ఇవీ చూడండి: కాడిమోస్తూ వ్యవసాయం..దంపతుల గోస..

tg_nzb_11_03_army_jawan_pc_avb_3180033 Reporter: Srishylam.K, Camera: Manoj (. ) దేశ ప్రజలకు రక్షణగా నిలిచే ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులకు రక్షణ లేకుండా పోతుందని భారత సైనికుడు సప్పేటి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి మూడు రోజులుగా కనపడక పోవడమే దీనికి నిదర్శనమని చెప్పారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. గత కొద్ది రోజులుగా తమ వ్యవసాయ భూమికి సంబందించిన వివాదాలు కొనసాగుతున్నాయని.. పిప్పిరి ఆంజనేయులు అనే వ్యక్తి తమ భూమిని పట్టా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గ్రామంలో తమ సొంత వ్యవసాయ భూమి 6 ఎకరాలను గ్రామానికి చెందిన గుండ్రేడ్డి సాయిరెడ్డి అక్రమంగా తనపెరిట మార్పిడి చేసుకున్నాడని.. ఈ విషయమై గత 15 రోజుల క్రితం వాట్సాప్ గ్రూపులలో సెల్ఫ్ వాయిస్ వీడియో పోస్ట్ చేయడం జరిగిందని అన్నారు. తమ భూమిని అక్రమంగ పట్టా చేసుకోవడమే కాకుండా గుండ్రేడ్డి సంగారెడ్డి ఆయన కుమారుడు రమేష్ రెడ్డి తన తండ్రి ఒంటరిగా దొరికినప్పుడు కిడ్నాప్ చేస్తామని బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం తన తండ్రి సాయిరెడ్డి ఆదివారం ఉదయం నుంచి కనపడటం లేదని, ఈ విషయం తన తల్లి సావిత్రి ద్వారా తెలుసుకుని స్పెషల్ లీవ్ తీసుకుని ఆర్మీ నుంచి వచ్చానని అన్నారు. తన తండ్రి కనపడటం లేదని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. తన తండ్రి కనపడక పోవటానికి కారణం పిప్పిరి ఆంజనేయులు, గుండ్రేడ్డి సంగారెడ్డి, రమేష్ రెడ్డిలు కారణమని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ చేపట్టి తన తండ్రి ఆచూకీ కనుగొనాలని కోరారు.... byte
Last Updated : Jul 3, 2019, 10:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.