కామారెడ్డి జిల్లా పిట్లం, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో రైతు వేదికలను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్, రైతు బీమా, పంట సాగుకు పెట్టుబడి ఇలా రకరకాలుగా రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. మంత్రితో పాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఉన్నారు.
ఇదీ చదవండి: 'మంథనిలో లీగల్ ఫ్యాక్షన్ నడుస్తోంది'