కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని వెళ్లుట్ల పేట గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. శనివారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రంలోని బోర్ మోటార్ బంద్ చేయడానికి వెళ్లిన మల్లయ్య... విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అదే మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో రాములు అనే వ్యక్తి ఈ రోజు ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై