ETV Bharat / state

హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: జడ్పీ ఛైర్మన్​ - జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం

జోగులాంబ గద్వాల జిల్లాలోని జిల్లా పరిషత్​ కార్యాలయంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముందు జడ్పీ ఛైర్మన్​ సరిత కార్యాలయ ఆవరణలో మూడు మెుక్కలను నాటారు. తమ మండల పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ సమావేశాన్ని ఉపయోగించుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

zp chairman planted trees in jogulamba gadwal district
కార్యాలయ ఆవరణలో మెుక్కలు నాటిన జడ్పీ ఛైర్మన్​
author img

By

Published : Jun 12, 2020, 10:36 PM IST

ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశ వేదికను జడ్పీటీసీలు, ఎంపీపీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ కె.సరిత అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జిల్లా పరిషత్ ఛైర్మన్​ కార్యాలయంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ముందు జడ్పీ ఛైర్మన్​ సరిత కార్యాలయ ఆవరణలో మూడు మెుక్కలు నాటారు. ఎంపీ సంతోష్​కుమార్​ విసిరిన ఛాలెంజ్​ను స్వీకరించి మెుక్కలు నాటామని సరిత తెలిపారు. ఈ సందర్భంగా తాను జడ్పీటీసీలకు ఈ సవాల్​ విసురుతున్నట్లు వెల్లడించారు. హరితహారంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి హరిత తెలంగాణగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులు, ప్రజలను కోరారు.

జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని ప్రజాప్రతినిధులందరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ ఛైర్మన్​ సూచించారు. శాఖా పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక మంచి వేదికని అన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరు మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని చెప్పారు.

జిల్లాలో 46 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భీమా నాయక్ తెలిపారు. అందులో 44 మంది చికిత్స అనంతరం ఆరోగ్యంగా తిరిగి రాగా, ఒకరు ప్రస్తుతం వైద్యం చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. ఒకరు మాత్రమే మరణించారని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శృతి ఓఝా, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: అభివృద్ధి పథంలో వెలిచాల గ్రామం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.