మహిళలు ఆర్థిక శక్తిమంతులు కావాలి : గద్వాల ఎమ్మెల్యే గద్వాల జిల్లా కేంద్రంగా మహిళలు కుటీర పరిశ్రమలు స్థాపించి ఆర్థిక శక్తిమంతులు కావాలని గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలో మహిళా భరోసా సేవాసమితి శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గద్వాల నారీ శక్తి ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.కుటీర పరిశ్రమలతో ప్రతి స్త్రీ ఆర్థిక అంశాల్లో స్వతంత్రంగా ఉండాలని ఆకాంక్షించారు. బ్యాంకు రుణాలను సక్రమంగా చెల్లిస్తే తిరిగి రుణం తీసుకోవడానికి మళ్లీ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇవీ చూడండి :మే15 నుంచి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు!