ETV Bharat / state

అక్కడే విద్యార్థుల చదువులు... అక్కడే తిండి... పడక - veerapuram SC Boys Gurukul School problems in jogulamba

అసలే ఇరుకైన గది.. అందులోనే చదువులు... అక్కడే పడక... అక్కడే తిండి... కాలకృత్యాలు తీర్చుకోవాలంటే... ఇప్పటికీ చెంబుపట్టుకొని ఆరుబయటికి వెళ్లాలి. స్నానం చేయాలంటే బక్కెట్‌లో నీరు తెచ్చుకోవాల్సిందే. ప్రభుత్వ వసతిగృహంలో వర్ణనాతీతంగా మారిన విద్యార్థుల గోసకు సాక్షీభూతంగా నిలుస్తోంది జోగులాంబ గద్వాల జిల్లాలోని ఓ ఎస్సీ గురుకుల పాఠశాల.

gurukul-school
ఎస్సీ గురుకుల పాఠశాల
author img

By

Published : Oct 29, 2021, 11:24 AM IST

చదువే పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నాంది. ప్రభుత్వబడుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు పాలకులు పదేపదే చెబుతున్నా... అదే స్థాయిలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని వీరాపురంలో ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఇక్కడ 5నుంచి పదో తరగతి వరకూ 450 మంది విద్యార్దులు చదువుతున్నారు. ఈ నెల 21 నుంచి గురుకులాలు పునఃప్రారంభం కాగా... ప్రస్తుతం 300మంది వరకు తరగతులకు హాజరవుతున్నారు. అద్దె భవనంలో నడిచే ఆ గురుకులంలో ఆరంభం నుంచే ఆగచాట్లు మొదలయ్యాయి.

ప్రశ్నార్థకంగా పారిశుద్ధ్యం

గురుకులంలోని వసతి గదులే.. ఉదయం తరగతి గదులు. వాటినీ క్రమం తప్పకుండా ఊడ్చేదిక్కు లేదు. అక్కడే తినడం, చదువుకోవటం, పడుకోవడం. ఇరుకైన గదుల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. విద్యుత్‌ సమస్యలతో ఫ్యాన్లు, బోర్లు కాలిపోయాయి. తినేతిండిలో నాణ్యత లోపించగా... కనీసం తాగేందుకు మంచినీరు అందుబాటులో లేని దుస్థితి. గతంలో ఉన్న బోర్లు చెడిపోయాయి. కాలకృత్యాలు సహా ఇతర అవసరాల కోసం బయటి నుంచే నీరు తీసుకొస్తున్నారు.

450 మందికి 7 మాత్రమే స్నానాల గదులు ఉండగా... 13 మరుగుదొడ్లున్నాయి. విధిలేని పరిస్థితిలో బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కరోనా పరిస్థితుల్లో ఇరుకు గదుల్లో ఉండాలంటే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. నీటి సమస్యపై పలుమార్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రిన్సిపల్‌ చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గురుకులాల నిర్వహణకు ప్రత్యేక నిధులు సహా మానవ వనరులను కల్పించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: GURUKUL DEGREE COLLEGES: కొత్తగా 20 డిగ్రీ గురుకుల కళాశాలలు!

satyavathi rathod: 'గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు సిద్ధం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.