ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామునుంచే భక్తుల రద్దీ నెలకొంది. నదిలో పుణ్య స్నానాలు ఆచరించి... కార్తిక దీపాలు వదిలారు. స్వామి, అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. దర్శనానికి గంట సమయం పట్టింది. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చిన భక్తులతో నాలుగు ఘాట్లు కిటకిటలాడాయి. నాలుగు ఘాట్లలో ఒక్కరోజే లక్షకుపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.
- అలంపూర్ పుష్కర ఘాట్- 51,455 మంది
- పుల్లూరు పుష్కర ఘాట్- 25,155 మంది
- రాజోలి పుష్కర ఘాట్- 25,125 మంది
- వేణిసొంపురం పుష్కర ఘాట్- 13,200 మంది
పుల్లూరు ఘాట్లో నందికొల సేవ, అలంపూర్ ఘాట్లో చిన్నారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వేద పండితులు నదీమ తల్లికి హారతులిచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: కార్తిక పుణ్య స్నానాలు, శివనామ స్మరణతో శైవక్షేత్రాలు