ETV Bharat / state

భారీ నష్టం జరగలేదు: ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ - genco latest news

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం వల్ల వేల కోట్ల నష్టం వాటిళ్లలేదని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్​ రావు అన్నారు. రూ.100 కోట్ల లోపే నష్టం జరిగినట్లు అంచనా వేశారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

trans co, junco cmd prabhakar rao visit srishailam  Hydroelectric power station
భారీ నష్టం జరగలేదు: ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ
author img

By

Published : Aug 26, 2020, 7:41 PM IST

Updated : Aug 26, 2020, 7:53 PM IST

ఆరో యూనిట్​ ప్యానల్ బోర్డ్​ నుంచి వచ్చిన మంటలతోనే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మంటలు వ్యాపించి ఉంటాయని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకరరావు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. 4వ యూనిట్​లో భారీగా నష్టం సంభవించిందని... ఇప్పట్లో అది అందుబాటుకోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. శ్రీశైలం భూగర్భ విద్యుత్ కేంద్రంలోని సర్వీస్ బే, 6 యూనిట్ల జనరేటర్లు, కంట్రోల్ ప్యానెల్స్, ట్రాన్స్ ఫార్మర్లు, ఇండోర్ గ్యాస్ సబ్ స్టేషన్, మెయిన్ కంట్రోల్ రూమ్​ల్లో తిరిగారు.

అందరూ అనుకున్నట్లు ప్రమాదం వల్ల వేల కోట్ల నష్టం వాటిళ్లలేదని స్పష్టం చేశారు. సుమారు వంద కోట్ల లోపే నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేశారు. 6వ యూనిట్​లో ప్యానల్ పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. 1,2 యూనిట్లను సెప్టెంబర్ 15 లోపు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వారిని ఎలా ఆదుకోవాలనే విషయాన్ని చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నామన్నారు.

ఇవీచూడండి: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ బుక్ క్లబ్: కవిత

Last Updated : Aug 26, 2020, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.