.
భోజనానికి వసతేదీ..? - problems in Government hospitals at gadwal district latest
జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు, ఉండవల్లి వేర్వేరు మండలాలకు కలిపి మానవపాడులోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఇక్కడికి నిత్యం పదుల సంఖ్యల్లో రోగులు వైద్యం కోసం వస్తుంటారు. కానీ, ప్రసవ సమయంలో గర్భిణులకు సహాయకులుగా వచ్చేవారికి, చిన్నాచితక వైద్యం కోసం వచ్చేవారికి భోజనం చేసేందుకు కనీస వసతులు లేవు. దీంతో బాధితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన ఓ గర్భిణికి ప్రసవం కావడం వల్ల ఆమె సహాయకులు ఆరుబయట ఇలా కూర్చోని భోజనం చేస్తూ కన్పించారు. ఇప్పటికైనా అధికారులు ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కారించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
no special place to eat food at government hospitals
.