జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ వద్ద కృష్ణానదీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పది సంవత్సరాల తర్వాత వారం రోజులుగా వరద నీటితో ఉరకలేస్తోంది. బీచుపల్లి వద్ద నదీ తీరంలో వెలిసిన కోదండరామాలయం, శివాలయం నీటమునిగాయి. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ దేవాలయాల్లో నీరు ఉన్నందున వారం రోజులుగా దూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు.
ఇదీ చూడండి: శాంతిస్తున్న కృష్ణమ్మ.. తగ్గుముఖం పట్టిన వరద