ETV Bharat / state

కృష్ణాపై బ్యారేజీ నిర్మాణానికి కసరత్తు.. వ్యయం రూ.2 వేల కోట్లు! - తెలంగాణలో బ్యారేజీ ప్రతిపాదనలు

శ్రీశైలం-జూరాల మధ్య ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే తెలంగాణ నీటిపారుదల శాఖ ఇన్వెస్టిగేషన్‌కు శ్రీకారం చుట్టనుంది. బ్యారేజీ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించే అవకాశం ఉంది.

telangana-irrigation-department-exercise-for-construction-of-barrage-on-krishna
కృష్ణాపై బ్యారేజీ నిర్మాణానికి కసరత్తు.. వ్యయం రూ.2 వేల కోట్లు!
author img

By

Published : Jun 22, 2021, 12:13 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ మండలం గొందిమల్ల, వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్లటూరు గ్రామాల మధ్య బ్యారేజీ నిర్మాణానికి అనుకూలతలు ఉన్నాయని ఇంజినీర్లు ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రతిపాదిత బ్యారేజీ నుంచి ఎప్పటికప్పుడు పైపులైన్‌ ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది తెలంగాణ నీటిపారుదల శాఖ(Telangana Irrigation Department) ప్రధాన ఉద్దేశం. కృష్ణా నదిలో తుంగభద్ర కలిసే ప్రాంతం సమీపంలో ప్రతిపాదించిన ఈ బ్యారేజీ ప్రాంతం దాటి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 269.75 మీటర్లు (885 అడుగులు) కాగా.. తాజాగా తెలంగాణ ప్రతిపాదించిన బ్యారేజీకి 256 మీటర్ల (840 అడుగులు) నుంచి 274 మీటర్ల (899 అడుగుల) వరకు అధ్యయనం చేయనున్నారు.

జూరాల వద్ద జల విద్యుత్‌ కేంద్రం 294 మీటర్ల వద్ద ఉంది. కొత్తగా ప్రతిపాదించిన బ్యారేజీ శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ పరిధిలోనే ఉంటుంది. కృష్ణా నదిపై 3.82 కి.మీ. పొడవు బ్యారేజీ నిర్మించాల్సి ఉంటుందని తాత్కాలిక అంచనా. ఇందుకు సుమారు రూ.రెండు వేల కోట్లు వ్యయం కావచ్చని నీటిపారుదల శాఖ ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిసింది. ఇక్కడి నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా నిర్మిస్తున్న ఏదులకు అనుసంధానం చేయడానికి లిప్టు, కొంత దూరం కాలువ, మరికొంత దూరం పైపులైన్‌ లేదా త్వరగా పూర్తి చేయడానికి వీలుగా మొత్తం పైప్‌లైన్‌ ద్వారానే మళ్లించాలా అన్నది కూడా అధ్యయనం చేయనున్నారు. ఇది సుమారు 35 కిలోమీటర్ల దూరం ఉంటుందని అంచనా.

ముంపు లేకుండా నిర్మాణానికే మొగ్గు

కృష్ణా-తుంగభద్ర నదీ సంగమానికి ఎగువన కృష్ణా నదిపై 256 మీటర్ల స్థాయి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఎగువన ఉన్న జూరాల బ్యారేజీ 294 మీటర్ల వద్ద ఉంది. ఈ రెండింటి మధ్య 65 కిలోమీటర్ల వరకు నది ఉండొచ్చని అంచనా. శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో సేకరించిన భూములు కూడా ప్రతిపాదిత బ్యారేజీ ప్రాంతంలో ఉన్నాయి. చిన్నంబావి మండలంలోని వెల్లటూరు, చిన్నమారూరు, పెద్దమారూరు, గూడెం, బెక్కెం, గడ్డ బస్వాపురం, పెబ్బెరు మండలం యాపర్ల, చిన్నగుమ్మడం, గుమ్మడం, తిప్పాయిపల్లి, మునగమాను దిన్నె గ్రామాలు, అలంపూర్‌ మండలంలోని గొందిమల్ల, భీమారం, మారమునగాల పరిధిలోని భూములను 1981లో శ్రీశైలం జలాశయ నిర్మాణం సందర్భంగా సేకరించారు. కొన్ని గ్రామాలను తరలించి పునరావాసం కల్పించారు. ప్రతిపాదిత బ్యారేజీకి భూ సేకరణ చేపట్టకుండానే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగుల కాంటూరు స్థాయి వద్ద 35.78 టీఎంసీలను నిల్వ చేసేందుకు వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల బ్యారేజీ వెనుక ప్రాంతంలో 112.32 చదరపు కిలోమీటర్ల వరకు నీరు విస్తరించనుంది. నదీ గర్భంలోనే ఈ నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

55.3 టీఎంసీలు నిల్వ చేస్తే..

కృష్ణా నదిలో 899 అడుగుల కాంటూరు స్థాయి (274 మీటర్లు) వద్ద నీటిని నిల్వ చేస్తే ప్రతిపాదిత బ్యారేజీలో గరిష్ఠంగా 55.3 టీఎంసీలను నిల్వ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల బ్యారేజీ వెనుక జలాలు 161.76 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నాయి. దీంతో భూ సేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గరిష్ఠ నీటి నిల్వకు మొగ్గు చూపితే నీటి నిల్వ స్థాయి 274 మీటర్ల కాంటూరు స్థాయి వరకు వెనుక జలాలు విస్తరించనున్నాయి. ఇప్పటికే శ్రీశైలం వెనుక జలాలు తాకుతున్న బీచుపల్లిని దాటి జూరాల బ్యారేజీ సమీపం వరకు వెనుక జలాలు వస్తాయి. జూరాల బ్యారేజీ దిగువన ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నదీ సమీపంలోనే ఉన్న 240 మెగావాట్ల దిగువ జూరాల జల విద్యుత్‌ కేంద్రంపై ముంపు ప్రభావం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ముంపు లేకపోయినా జల విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం నీళ్లు దిగువకు వేగంగా వెళ్లడం సాధ్యం కాకపోవచ్చనీ భావిస్తున్నారు. ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణం, భూసేకరణ, ముంపు ప్రభావంపై నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: KCR: నేడు వాసాలమర్రిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.