దేశంలోనే ఐదవదైన అలంపూర్ శక్తి పీఠం తెలంగాణలో ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. జోగులాంబ జిల్లాలోని బాల బ్రహ్మేశ్వర ఆలయాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 36.73 కోట్ల విడుదల చేసిందని పేర్కొన్నారు.
అలంపూర్‌కు పర్యాటకంగా మంచి రోజులొచ్చాయని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఆలయాభివృద్ధికి, భక్తులకు, పర్యాటకులకు సౌకర్యాలను కల్పించనున్నట్లు వివరించారు. 13 కోట్లతో బస్ సెల్టర్, 3 కోట్లతో బోటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు