జోగులాంబ జిల్లా గద్వాలకు (jogulamba gadwal) చెందిన హన్మంతు (83).... రెండేళ్ల క్రితం మరణించిన తన భార్య రంగమ్మపై ప్రేమను శాశ్వతంగా గుర్తిండిపోయేలా చేసుకున్నాడు. ఇంతకాలం తనకు అన్నీ తానై తోడుండి.. కనుల ముందు తిరిగిన భార్య రూపాన్ని రోజు చూస్తుండడం కోసం... భార్య విగ్రహాన్ని ఏర్పాటుచేశాడు (man install life like statue of his wife).
రంగమ్మ 2019 సెప్టెంబర్ 9న మృతి చెందింది. ఆమెపై ప్రేమతో హన్మంతు రూ. 7లక్షల వ్యయంతో మండపాన్ని ఏర్పాటు చేసి.. భార్య విగ్రహాన్ని ప్రతిష్టించాడు. తన భార్యతో కలిసి నిర్మించి.. ఆమె బతికున్నంతకాలం సేవలు చేసిన ఆలయ సమీపంలోనే.. రంగమ్మ విగ్రహం ప్రతిష్టించాడు. విగ్రహం చూస్తుంటే రంగమ్మ తమతో ఉన్నట్టే అనిపిస్తోందని...కుటుంబ సభ్యులు భావోద్వోగానికి లోనవుతున్నారు.
మా నానమ్మ రెడేళ్ల క్రితం మృతిచెందారు. నానమ్మ మృతి తర్వాత ఆమె విగ్రహం కట్టించాలని తాతయ్య అనుకున్నారు. వారిద్దరూ ఈ పొలాలు అన్నీ కలిసి చేసుకునేవారు. ఈ విగ్రహం ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.7లక్షలు అయింది. ఈ విగ్రహం చూస్తుంటే.. నాన్నమ్మ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. -మృతురాలి మనుమడు
ఈ విగ్రహం చూస్తుంటే మా నాన్నమ్మ మాతోనే ఉన్నట్టు ఉంది. చాలా కష్టపడింది నాన్నమ్మ. మా తర్వాత తరాల అందరికీ మా నాన్నమ్మ గురించి తెలియాలి. విగ్రహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. -మృతురాలి మనుమరాలు