ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ ఆలయ సమీపంలో తుంగభద్ర పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. తుంగభద్ర పుష్కరాలకు రెండో రోజు భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి... నదిలో దీపాలు వదులుతున్నారు. భక్తులు పుష్కర ఘాట్ నుంచి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంచనా వేసిన దాని కన్నా... భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతుండటం వల్ల దుస్తులు మార్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. తాగు నీరు, మొబైల్ మరుగుదొడ్ల విషయంలో అవస్థలు తప్పేలాలేవు. ఇప్పటికైనా అధికారులు జాగ్రత్తపడితే... సమస్యను పరిష్కరించవచ్చని భక్తులు కోరుతున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.