ETV Bharat / state

వారం రోజులు కావొస్తున్నా.. ఆ మార్కెట్ యార్డ్​లో తూకం వేయరు..!

pulse farmers in Jogulamba Gadwala: జోగులాంబ గద్వాల జిల్లాలో యాసంగిలో పండించిన పప్పుశనగను అమ్ముకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. గన్నీసంచుల కొరత, ధాన్యం రవాణా జాప్యంతో ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈసారి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు దిగుబడి రాగా.. అధికారులు ఎకరాకు ఆరున్నర క్వింటాళ్లే కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో మిగిలిన పంట ఎక్కడ అమ్మాలన్నది ప్రశ్నార్థకంగా తయారైంది. దళారులకు అమ్మితే గిట్టుబాటు ధర దక్కడం లేదు.

పప్పుశనగ రైతు
పప్పుశనగ రైతు
author img

By

Published : Mar 11, 2023, 4:09 PM IST

pulse farmers in Jogulamba Gadwala: జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 15వేల 266 ఎకరాల్లో పప్పుశనగ సాగైంది. ఈసారి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ పంటను నాఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయా పీఏసీఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే దాదాపుగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో గన్నీసంచుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొనుగోలుకు సంబంధించిన అన్ని టోకెన్లను ముందే పంపిణీ చేయడంతో రైతులు పంటతో సహా కేంద్రాలకు వస్తున్నారు. కానీ కేంద్రాల్లో గన్నీసంచుల కొరత కారణంగా కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇంకోవైపు వర్షానికి పంట తడుస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో లక్షా 50 నుంచి లక్షా 80వేల క్వింటాళ్ల వరకూ పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ దిగుడబడి అంచనాలు రూపొందించింది. కానీ కొనుగోలు కేంద్రాల్లో ఎకరాకు 6.38 క్వింటాళ్ల చొప్పన ఓక్కో రైతు నుంచి గరిష్టంగా 25క్వింటాళ్లు మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన పప్పుశనగను ఎవరు కొనుగోలు చేయాలన్న విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు 5వేల 335 రూపాయలు మద్దతు ధర ధర పలుకుతోంది. అమ్మగా మిగిలిన పంటను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుందామంటే.. దళారులు క్వింటాలుకు 4వేల నుంచి నాలుగున్నర వేలు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు.

దీంతో రైతులు వెయ్యి రూపాయల వరకు నష్టపోతున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు గోదాములకు తరలించడంలోనూ ఆలస్యం జరుగుతోంది. దీంతో చాలాకేంద్రాల్లో తాజా కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. ఇది చాలదన్నట్లు తరుగు పేరిట బస్తాపై నిర్ణీత బరువు కంటే అధికంగా తూకం వేస్తున్నారు. హమాలీ ఛార్జీలు సైతం క్వింటాలుకు 30 రూపాయల చొప్పున రైతుల నుంచే వసూలు చేస్తున్నారు.

మేము మార్కెట్​కు పప్పుశనగను తీసుకొచ్చి వారం రోజులవుతోంది. ఇంకా తూకం కాలేదు. ఇక్కడ గన్నీ సంచుల కొరత ఉంది. పప్పు శనగ తూకాలను త్వరగా వేయడం లేదు. ఎకరానికి ఆరున్నర క్వింటాళ్లే కొనుగోలు చేస్తున్నారు. మిగతా పంటను మేము ఎక్కడ అమ్ముకోవాలి. బయట దళారులు తక్కువ ధరకు కొంటున్నారు. -నాగ మద్దిలేటి, ఉండవల్లి

యాసంగిలో పప్పుశనగ సాగు చేసిన రైతులు పంటను అమ్ముకునేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించాలనీ పండించిన పంటనంతటినీ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

పప్పుశనగ రైతులకు మార్కెట్​లో విక్రయ తిప్పలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.