నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ కలెక్టరేట్ల ఎదుట నిరసన చేపట్టింది. అందులో భాగంగా.. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ.. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి మెమోరాండం సమర్పించారు.
అన్యాయం చేస్తోంది
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడమే కాక.. కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా అన్యాయం చేస్తుందన్నారు.
ఇదీ చదవండి:'మీరు పరిష్కరిస్తారా? చట్టాలపై మేము స్టే విధించాలా?'