ETV Bharat / state

Paddy Procurement in TS : వడ్లు కొనరాయే.. కొంటే తీసుకపోరాయే.. ఏం చేయాలె సారూ..? - Paddy Procurement in Gadwal

Paddy Procurement in Gadwal : అకాల వర్షాల కారణంగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులను, కొనగోళ్ల కేంద్రం వద్ద తరుగు పేరిట మిల్లర్లు నానా అవస్థలకు గురిచేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో క్వింటాకు 8 కిలోల వరకూ తరుగు తీసేందుకు అంగీకరిస్తేనే ధాన్యాన్ని దింపుకుంటామంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. ఈ కారణంగా చాలా ప్రాంతాల్లో కొనుగోళ్లు ముందుకు సాగడంలేదు. ధాన్యం నింపిన లారీలు సైతం మిల్లుల దగ్గరే ఉండి పడిగాపులు కాయాల్సి వస్తోంది. నాణ్యతా ప్రమాణాలను బట్టే ధాన్యాన్ని ధాన్యాన్ని కొనుగోళు చేస్తామన్నారు. వారిని ప్రభుత్వమే చొరవతో పరిష్కార మార్గాన్ని చూపాలని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు.

Millers
Millers
author img

By

Published : May 16, 2023, 1:56 PM IST

వడ్లు కొంటలేరు..కొన్నవి తీసుకపోతలేరు... ఏం చేయ్యాలి సార్​...!

Paddy Procurement in Gadwal : జోగులాంబ గద్వాల జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతుల ఇబ్బందులు తప్పట్లేవు. నిర్ణీత తేమశాతం, నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం ఉంటేనే తూకం వేస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేల్చిచెబుతున్నారు. దీంతో తెచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టి, తూర్పారాపట్టి నాణ్యత ప్రమాణాలు లోబడి ఉండేలా సిద్ధం చేసినా, కొనుగోళ్లు మాత్రం జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎఫ్​ఎక్యూ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యం బస్తాలను తూకం వేసి మిల్లుకు పంపినా, ఆ ధాన్యాన్ని దింపుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. క్వింటాకు దాదాపు 8 కిలోలు వరకు అదనంగా మిల్లర్లు దోచుకుంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Paddy Procurement problems in Gadwal : రైతులు ఆందోళన బాట పట్టినా మిలర్లు మాత్రం తరుగుకు అంగీకరిస్తేనే దింపుకుంటామంటూ మొండికేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ కింద క్వింటా ధాన్యం అప్పగిస్తే అందులో 67- 68 కిలోల ముడిబియ్యం లేదా ఉప్పుడు బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్​సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈసారి జోగులాంబ గద్వాల జిల్లాలో పండించిన తరంగిణి, చంద్ర, మహేంద్ర, కేఎన్​ఎమ్​ లాంటి వివిధ రకాల ధాన్యం నుంచి 58 కిలోల బియ్యం మాత్రమే వస్తోందని, తాలు అధికంగా ఉంటోందని మిల్లర్లు చెబుతున్నారు. ఇలాగైతే రైతుతో పాటు, మిల్లర్లు నష్టపోతారని అందుకే ఈ విషయంలో ప్రభుత్వమే చొరవ చూపాలని మిలర్లు కోరుతున్నారు.

అనుకున్నది ఒకటి చేసింది ఒకటి : గద్వాల జిల్లా రైస్‌ మిల్లర్స్ అసోసియేషన్‌ జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు 50 వేల నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. అందుకోసం జిల్లా వ్యాప్తంగా 72 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు కేవలం 37 కేంద్రాలు తెరచుకోగా 15 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరిగాయి.

మాపై దృష్టి పెట్టండి : 7 వేల 360 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే, 1554 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కేవలం ఐకేపీ కేంద్రాలు మాత్రమే తెరచుకోగా పీఎస్​సీఎస్​లు, మెప్మా, వ్యవసాయ మార్కెట్లలో అసలు కొనుగోళ్లే జరగలేదు. జిల్లాలో రైతుల పరిస్థితి ఏమిటో ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతోంది. మిల్లర్లంతా కుమ్మక్కై ఉద్దేశ పూర్వకంగానే ధాన్యం కొనడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.