జోగులాంబ జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వరి, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో మల్దకల్, ధరూర్, కేటీ దొడ్డి, మండలాల్లోని సోంపురం, చింతరేవుల, పాతపాలెం, గ్రామాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పర్యటించారు. పూర్తిగా నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు.
నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. నీట మునిగిన పంటలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇప్పించేలా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ధరూర్ ఎంపీపీ నజూమున్నీ బేగం, జడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సర్పంచులు, తెరాస పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జాకీర్, ఉరుకుందు, వ్యవసాయ శాఖ, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఈ పరికరం కరోనాను కడిగేస్తోంది..!