జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. గద్వాల పట్టణానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు 30 లక్షల 3వేల 480 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు.
కరోనా కష్ట సమయంలో కూడా పేదప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని ఎమ్మెల్యే అన్నారు. ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇవీ చూడండి: జూన్ 6వరకు రాష్ట్రంలో న్యాయవ్యవస్థ లాక్‌డౌన్