ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్​ కారణజన్ముడు: నిరంజన్​రెడ్డి - cm kcr birthday at jogulamba gadwal

సీఎం కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి నిరంజన్​రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి పాల్గొన్నారు. కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. కేక్​ కట్​ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

minister niranjan reddy participated in cm kcr birthday celebrations
ముఖ్యమంత్రి కేసీఆర్​ కారణజన్ముడు: నిరంజన్​రెడ్డి
author img

By

Published : Feb 17, 2021, 6:40 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న కేసీఆర్ స్టడీ సర్కిల్ ఆవరణలో కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. మొక్కలు నాటి విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు. సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్లకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ కారణజన్ముడు అని మంత్రి నిరంజన్​రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్టడీ సర్కిల్ ద్వారా విద్యార్థులు బాగా చదువుకుని.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

కోటి వృక్షార్చన విజయవంతమైంది: ఎంపీ సంతోష్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.