జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని బాల బ్రాహ్మమేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాపానాషీశ్వర స్వామి, సంగమేశ్వర స్వామి ఆలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్త జనం అభిషేకాలు చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.