జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో మార్చి మూడునుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే గణపతి పూజ, రిత్విక్ వరణం, ధ్వజారోహణతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకే శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కల్యాణోత్సవం జరిపిస్తారు. మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు రథోత్సవం, గురువారం 11 గంటలకు అవబృద స్నాపనముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
వేల సంఖ్యలో భక్తుల హాజరు
ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు దాదాపు 50 నుంచి 70 వేల మంది హాజరవుతారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు.
ఇవీ చదవండి:కాసేపట్లో పైలట్ రాక
పాక్ కుర్చీ ఖాళీ