జోగులాంబ గద్వాల జిల్లాలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్పీ కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. గద్వాలలోని డీఎస్పీ ఆఫీస్ నుంచి కృష్ణారెడ్డి బంగ్లా వరకు రన్ నిర్వహించారు.
గద్వాల జిల్లాలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని ఏఎస్పీ తెలిపారు. ఇక్కడ ఉన్న ప్రధాన అధికారులలో మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే 100కు డయల్ చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య