జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి 5 లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా... ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
జలాశయం పూర్తి నీటి మట్టం 1,045 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1,042 అడుగులు ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 8.087 టీఎంసీలు ఉంది. జలాశయం 50 గేట్లు తెరిచి 5 లక్ష 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇదీ చూడండి: నిండుకుండలా ఫాక్స్‌సాగర్... అలుగు పోస్తే దిగువ ప్రాంతాలకు ముప్పు