జోగులంబ గద్వాల జిల్లా గద్వాల శ్రీ స్వయంభూ లక్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి స్వత్మానందేంద్ర స్వామి హిందూ ధర్మ ప్రచార యాత్ర ముగింపు కార్యక్రమం చేపట్టారు. ఏడేళ్ల వయస్సులో వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేసి హిమాలయాలు, హృషికేశవులు, గురువులతో కలిసి ప్రయాణం చేశానని స్వత్మానందేంద్ర స్వామి అన్నారు.
7,500 కిలోమీటర్లు 70 పట్టణాలు, ఆలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించామని.. గద్వాల కోటలో యాత్ర ముగింపు చేసి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోకి అడుగుపెట్టబోతున్నామని స్వామి తెలిపారు. కార్తీక మాసం మొత్తం తెలంగాణ ప్రాంతంలో గడపడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జగద్గురువు శ్రీ శంకరాచార్యుల ఆశీస్సులతో తెలంగాణలో యాత్ర పూర్తి చేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి : విషాదం.. రెండు ప్రేమజంటల బలవన్మరణం