జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆరగిద్దలో జాతీయ ఆహార భద్రత పథకం కింద ఉచిత వరి విత్తనాలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పంపిణీ చేశారు. తెరాస ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతల కోసం 24 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు రైతుబీమా, రైతుబంధు పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు.
జిల్లాలోని జాతీయ ఆహార భద్రత పథకం కింద జీవ రసాయనాల ద్వారా ఎరువులను తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.