జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు... క్యూలైన్లలో నిలిచిఉన్నారు. కేవలం తెలంగాణ ప్రజలే కాకుండా... ఏపీ,కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఇవీ చూడండి: 'టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడని ఓనర్నే లేపేశాడు'