స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శృతి ఓఝా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఆయన విగ్రహానికి కలెక్టర్, ఎమ్మెల్యే, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహానీయుల స్మరణలో జిల్లా కేంద్రంలో ఆడిటోరియాన్ని భవిష్యత్తులో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే అన్నారు.
ఇదీ చదవండి: 'కచ్‌లో చెరువుల్ని పునరుద్ధరించి.. సరికొత్త వెలుగులు నింపింది'