జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో స్వేరో సంబరాల్లో భాగంగా ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో పరుగు పందెం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఉండవల్లి మండలం భైరపురం గ్రామం నుంచి అలంపూర్‌లోని స్వేరో పైలాన్ వరకు నిర్వహించిన 10కె రన్లో ప్రవీణ్ కుమార్ పాల్గొని అందరినీ ఉత్సాహ పరిచారు. 10 కిలోమీటర్ల దూరాన్ని 53 నిమిషాలలో పూర్తి చేశారు.
అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే నినాదంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు. తాను 30ఏళ్లుగా వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు.
ఇదీ చదవండి: అప్పుడే.. యాదాద్రి ప్రధానాలయ ప్రారంభోత్సవం!