రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక కలెక్టర్ శశాంక్ పర్యటించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, హరితహారం మొదలైన పనులను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లకు పలు సూచనలు చేశారు. గ్రామస్థులంతా సమిష్టిగా కృషి చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: నామినేషన్లకు నేడే చివరి తేదీ