ETV Bharat / state

న్యాయవాదుల హత్య.. తెరాస చేసిన హత్యే: డీకే అరుణ

న్యాయవాదుల హత్య.. తెరాస ప్రభుత్వం చేయించిన హత్యేనని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడిన వారిని నడిరోడ్డుపై అతి కిరాతకంగా చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్​, రంగారెడ్డి, హైదరాబాద్​ పట్టభద్రుల ఎన్నికల దృష్ట్యా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో అరుణ ప్రెస్​మీట్​ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావును గెలిపించాలని కోరారు.

dk aruna, lawyers murder
డీకే అరుణ, న్యాయవాదుల హత్య
author img

By

Published : Feb 20, 2021, 4:21 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావుతో కలిసి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామచంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించాలని డీకే అరుణ కోరారు.

న్యాయవాదుల హత్య.. తెరాస చేసిన హత్యనే: డీకే అరుణ

ఇది తెరాస హత్యే..

రాష్ట్రంలో సంచలనంగా మారిన న్యాయవాద దంపతుల హత్యను రాజకీయ హత్య కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా తాము భావిస్తున్నట్లు అరుణ పేర్కొన్నారు. తెరాస మాజీ ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్​పర్సన్ పుట్ట మధు మేనల్లుడి అరెస్టుతో ఆ విషయం తేటతెల్లమైందని వెల్లడించారు. ప్రభుత్వంపైనా తమకు నమ్మకం లేదని.. ఈ హత్య వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందో తెలియాలంటే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు.

రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడిన వారిని తెరాస నాయకులు దుర్మార్గంగా నడిరోడ్డుపై హత్యలు చేస్తున్నారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి వ్యక్తిగత హత్యలు కావని భూ కబ్జాలకు ఎదురు తిరిగినందుకే చంపేశారని ఆరోపించారు. న్యాయవ్యవస్థకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: న్యాయవాదుల హత్యతో సంబంధం లేదు: పుట్ట మధు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.