జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడు గ్రామ ప్రజలకు నూతన పునరావాస కేంద్రాల్లో పక్కా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ర్యాలంపాడులోని భూ నిర్వాసితులైన 630 మందికి ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు.
ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి ర్యాలంపాడు ప్రజలు తమ భూములను రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇచ్చి.. వారు చేసిన మేలును ఎన్నడూ మరచి పోలేమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కొనియాడారు. రిజర్వాయర్ కోసం భూములను ఇచ్చినా.. గత పాలకులు వారికి పునరావాసం కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
12 ఏళ్ల నిరీక్షణ నేడు ఫలించిందని.. అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చామన్నారు. ఆర్ఆర్ సెంటర్‌లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి అభివృద్ది పరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ‘నిర్వాసితులకు పదిరోజుల్లో ఉద్యోగాలు’