ETV Bharat / state

తుమ్మిళ్ల ఎత్తిపోతల పంపింగ్ పైపులో మృతదేహం...!

నాలుగు రోజుల క్రితం రాత్రి పూట తోటి కాపరులకు భోజనం తీసుకుని గొర్రెల దగ్గరికి వెళ్లాడు. అప్పటి నుంచి కన్పించలేదు. ఎక్కడికి పోయాడో జాడ లేదు. ఎంత వెతికినా ఆచూకీ లేదు. చివరికి తుమ్మిళ్ల ఎత్తిపోతల పైపులో కుళ్లిన శవంగా కన్పించాడు. ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా...? లేక ఎవరైన అతన్ని చంపి అందులో పడేశారా...? లేక ఆత్మహత్య చేసుకున్నాడా...?

author img

By

Published : Sep 14, 2019, 9:52 PM IST

DEAD BODY FOUND SUSPICIOUSLY IN THUMMILLA PUMPING PIPE

జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం తనగల శివారులో ఉన్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పైపులో మృతదేహం లభ్యమైంది. ఎత్తిపోతల పైపు నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పైపులో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. క్రేన్ సహాయంతో బయటికి తీసి చూడగా... మృతుడు రాజోలి మండలం పెద్ద తాండ్రపాడుకు చెందిన మేషాక్​గా పోలీసులు గుర్తించారు. మంగళవారం రాత్రి తన తోటి గొర్రెల కాపరులకు భోజనం తీసుకొని మేషాక్​ వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. చివరికి పైపులో శవమై తేలాడు. మేషాక్​కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

తుమ్మిళ్ల ఎత్తిపోతల పంపింగ్ పైపులో మృతదేహం...!

ఇదీ చూడండి: శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!

Intro:Tg_Mbnr_07_14_Panchaiti_Sekretarila_Nirasana_AVB_ts10091
Contributor:- J.Venkatesh ( Narayana pet). 9394450173
Centre:- Mahabub nagar

(. ). నాగర్ కర్నూలు జిల్లా మూలం గ్రామానికి చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఇ స్రవంతి ఆత్మహత్య కు నిరసనగా నారాయణపేట జిల్లాలో పంచాయతీ సెక్రెటరీ నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక ఎంపిడిఓ కార్యాలయం నుండి ఇ జిల్లా పంచాయతీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు నారాయణపేట జిల్లాలో సైతం పంచాయతీ కార్యదర్శుల పై పని భారం పెరిగిందని నారాయణపేట జిల్లాకు చెందిన కార్యదర్శులు తమ ఆవేదనను వెలిబుచ్చారు ఇటీవల రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడి కారణంగా తమ పదవులకు రాజీనామాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇందులో భాగంగా గత రెండు రోజుల నుండి పని ఒత్తిడి తట్టుకోలేక క్రిమిసంహారక మందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్రవంతి కార్యదర్శి మృతిచెందిన సంఘటనకు మద్దతుగా నారాయణపేటలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మౌనం పాటించారు అలాగే నారాయణపేట జిల్లాలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా తమకు సైతం పని భారం పెరిగిందని ఒకరోజు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహిస్తున్న మని ఆవేదన వెలిబుచ్చారు 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం పచ్చదనం కోసం ప్రజలను చైతన్య పరుస్తున్నారు అధికారులు ప్రజల్లో చైతన్యం రావడంలేదని వారి ఆవేదన వెలిబుచ్చారు కేవలం నామమాత్రంగానే అధికారులు గ్రామాల్లో ఉంటున్నారని మిగిలిన కార్యక్రమాలన్నీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల నిర్వహిస్తున్నామని తమ అభిప్రాయం వెలిబుచ్చారు అయినప్పటికీ తమ గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఇ మురళి ముందు పంచాయతీ సెక్రెటరీ తమ ఆవేదనను వినిపించారు

Body:నాగర్ కర్నూల్ జిల్లాలో పని ఒత్తిడి కారణంగా క్రిమిసంహారక మందు సేవించి మృతిచెందిన పంచాయతీ సెక్రెటరీ స్రవంతి మృతికి సంతాపంగా నారాయణపేటలో రెండు నిమిషాలు మౌనం పాటించారు

Conclusion:నాగర్ కర్నూల్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న సమంతకి మద్దతుగా నారాయణపేట నుండి పంచాయతీ కార్యదర్శులు అంత్యక్రియలకు బయలుదేరి వెళ్లారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.