ETV Bharat / state

గద్వాలలో భయపెడుతున్న కిడ్నీ వ్యాధి - treatment

ప్రజలను పట్టి పీడించే ఆరోగ్య సమస్యలలో మూత్రపిండాల వ్యాధి అతి ముఖ్యమైనది. ఒక్కసారి ఇది వస్తే కిడ్నీలు మార్పు చేసుకుంటే తప్ప నయం కాదు. వారంలో రెండు లేదా మూడు సార్లు రక్తాన్ని శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వ్యాధి రావడం ఒక సమస్య అయితే, రక్త శుద్ధి చేయించుకోవడం మరో భారం.

సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న రోగులు
author img

By

Published : Mar 15, 2019, 12:29 PM IST

సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న రోగులు
కిడ్నీ సమస్యలతో బాధపడేవారిలో తెలంగాణ వ్యాప్తంగా జోగులాంబ గద్వాల జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 250 మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా 150 మందికి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. అందుబాటులో లేని యంత్రాలు...
జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు రక్త శుద్ధి చేసుకుంటున్నారు. ఈ జిల్లా కేంద్రంలో కేవలం 5 శుద్ధి యంత్రాలు మాత్రమే ఉన్నాయని 150 మందికి అవి ఎలా సరిపోతాయని వ్యాధి బాధితులు వాపోతున్నారు. సరిపడా బెడ్​లు లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పనిభారం పెరుగుతోంది...
ఈ 5 యంత్రాల్లో 4 మాత్రమే సరిగా పనిచేస్తున్నాయని యాజమాన్యం చెబుతోంది. మరో 5మిషన్​లు వస్తాయని చెబుతున్నా... ఇప్పటివరకు అవి రాలేదని తెలిపారు. ఉదయం 5 నుంచి తెల్లవారుజామున 3 గంటలవరకు ఈ కేంద్రం తెరిచే ఉన్నా... యంత్రా​లు తక్కువ ఉండడం వల్ల పనిభారం పెరుగుతోందని డయాలసిస్​ సూపరింటెండెంట్ తెలిపారు.
పింఛన్ ఇప్పించండి...
ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు మహబూబ్​నగర్, హైదరాబాద్​కు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. మాత్రలు కొనుక్కోవడం కూడా కష్టమవుతుందని పేర్కొంటున్నారు. డయాలసిస్​ రోగులకు పింఛన్ ఇవ్వాలని కోరుతున్నారు. మంచి నీళ్లు, ఫ్యాన్లు, డాక్టర్ల కొరత ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో మూత్రపిండాల వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నా... యంత్రాలు అధిక సంఖ్యలో ఉంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని రోగులు, వైద్యులు పేర్కొంటున్నారు. డయాలసిస్ రోగులకు ప్రభుత్వ పింఛన్ అందిస్తే వారికి కొంత వరకు భరోసా ఉంటుంది.

ఇవీ చూడండి:కాల్పుల్లో 9 మంది మృతి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.