ETV Bharat / state

రైతులకు మిగిలేది అప్పేనా?.. నిలువు దోపిడీ ఇంకెన్నాళ్లు? - పత్తి రైతుల కష్టాలు

పెట్టుబడి కోసం అప్పులు.. ఆపై అధిక వడ్డీలు... పంట అప్పగించినా లెక్కలు తేల్చకుండా వడ్డీ వసూళ్లు... తూకంలో మోసాలు.. తరుగు పేరుతో కోతలు... ఒకటా రెండా... జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తి సాగు పేరిట ఆర్గనైజర్లు, కంపెనీలు చేసే దోపిడీ అంతా ఇంతా కాదు. తమకు న్యాయం చేయాలంటూ రైతులు పోరు బాట పట్టినా.. ఎవరూ అటువైపు చూసిన పాపాన పోలేదు. మరి ఈసారైనా తెలంగాణ సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తుందా?

cotton seed farmers
పోరుబాట పట్టినా... నిలువు దోపిడీని ఆపరా?
author img

By

Published : May 9, 2020, 5:30 PM IST

Updated : May 9, 2020, 6:27 PM IST

దేశంలోనే విత్తనపత్తి అత్యధికంగా సాగయ్యే జిల్లా జోగులాంబ గద్వాల. దేశంలో ఉత్పత్తి అయ్యే విత్తన పత్తిలో జిల్లా వాటా సుమారు 30 శాతం. 40 వేల మంది రైతులు, కూలీలు, ఆర్గనైజర్లు, కంపెనీల్లో సిబ్బంది సహా లక్షల మంది దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దశాబ్దాలుగా నడిగడ్డ రైతులు విత్తన పత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయినా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

నిలువు దోపిడీ..

జూన్, జులై నెలలో విత్తన పత్తి సాగు మొదలవుతుంది. విత్తన పత్తి సాగుచేసే రైతుకు ఆయా కంపెనీలే 18 శాతం వడ్డీతో అప్పులు ఇస్తాయి. కానీ కంపెనీకి, రైతులకు మధ్య దళారులుగా ఉండే ఆర్గనైజర్లు పెట్టుబడి సాయం పేరుతో రూ.2 రూపాయల వడ్డీ వసూలు చేస్తారు. ఇందుకు ఎలాంటి చట్టబద్దమైన ఒప్పంద పత్రాలు ఉండవు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం అది నిబంధనలకు విరుద్ధం.

వడ్డీ తేల్చరు.. లెక్కగట్టరు

జూన్​కు ఒకటి, రెండు నెలల ముందే ఆర్గనైజర్లు రైతులకు పెట్టుబడి పేరు మీద అప్పులిస్తారు. అప్పటి నుంచే వడ్డీ లెక్కగడతారు. నవంబర్, డిసెంబర్ నాటికి పంట చేతికొస్తుంది. రైతులు ఆ పంటను ఆర్గనైజర్లకు అప్పగిస్తారు. పంట ఎప్పుడు అప్పగిస్తే అప్పటి వరకే వడ్డీ వసూలు చేయాలి. పెట్టుబడి ఇచ్చిన కంపెనీ కూడా ఆర్గనైజర్ల నుంచి అప్పటి వరకే వడ్డీ వసూలు చేస్తుంది. కానీ ఆర్గనైజర్లు మాత్రం మళ్లీ సీజన్ ప్రారంభమయ్యే వరకూ లెక్కలు తేల్చరు. వడ్డీ మాత్రం వసూలు చేస్తూ రైతుల జేబులు గుల్ల చేస్తారు. దీంతో వచ్చిన అంతో ఇంతో ఆదాయం వడ్డీలకు సరిపోతోందని రైతన్నలు వాపోతున్నారు.

తూకంలోనూ చేతివాటం..

పంట అప్పగించిన తర్వాత కూడా ఆర్గనైజర్ల దోపిడీ కొనసాగుతుంది. జిన్నింగ్​ ఛార్జీలు కూడా రైతు నుంచే వసూలు చేస్తారు. తూకంలోనూ చేతివాటం చూపిస్తారు. క్వింటాకు 7 కేజీల చొప్పున తరుగు తీస్తారు. గింజ లేని పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో ఏ రేటు ఉందో అంతే రైతుకు చెల్లించాలి. ఆ ధరల్ని కాటన్ మిల్లుల వద్ద ప్రదర్శించాలి. కానీ ఆర్గనైజర్లు మాత్రం సీజన్​లో కనిష్ఠంగా ఏ రేటు ఉంటుందో అంతే చెల్లిస్తారు.

తరుగుపేరిట మోసం..

వేరుచేసిన విత్తనాన్ని శుద్ధిచేసిన అనంతరం నాణ్యమైన విత్తనాలు తూకం వేసేటప్పుడు మాత్రం కంపెనీలు రైతులను తప్పనిసరిగా పిలుస్తాయి. వారి ముందే తూకం వేసి.. రశీదు ఇచ్చి పంపుతాయి. మళ్లీ అక్కడ కూడా ఆర్గనైజర్లు దోపిడికి తెరలేపుతారు. శుద్ధిచేసిన విత్తనాల్లో పనికి రాకుండా పోయిన విత్తనాలు, నాసిరకం విత్తనాలంటూ మొత్తం ప్యాకెట్ల నుంచి 10 నుంచి 20 శాతం ప్యాకెట్లను కోత కోస్తారు. అలా తరుగుపోగా వచ్చిన విత్తన ప్యాకెట్లకే డబ్బులు లెక్కగట్టి ఇస్తారు.

విత్తన కంపెనీలు ఒక్కో ప్యాకెట్​కు రూ.450 నుంచి రూ.490 ఆర్గనైజర్లకు చెల్లిస్తాయి. కానీ ఆర్గనైజర్లు మాత్రం.. రైతులకు గరిష్ఠంగా రూ.410 చెల్లిస్తున్నారు. గతేడాది ధరలు పెంచాలని రైతులు డిమాండ్​ చేసినా ఆర్గనైజర్లు ససేమిరా అన్నారు.

ఒప్పందాలుండవు.. వివరాలూ ఇవ్వరు

సాగుకు ముందే రైతుకు - కంపెనీకి, రైతుకు - ఆర్గనైజర్​కు, కంపెనీకి మధ్య ఒప్పందాలు జరగాలి. అందులో పెట్టుబడి రుణం, వడ్డీ, విత్తన ప్యాకెట్ ధర సహా అన్ని అంశాలు పొందుపరచాలి. కనిష్ఠ, గరిష్ఠ ధరలను పత్తి కంపెనీల్లో బోర్డులపై ప్రదర్శించాలి. ప్రతి లావాదేవీకి అధికారిక రశీదు ఉండాలి. బడిఈడు పిల్లలను కూలీలుగా వినియోగించుకోబోమంటూ ఒప్పంద పత్రంలో చేర్చాలి. అసలు ఏ కంపెనీ ఏ రైతుతో ఎంత పత్తి సాగు చేస్తోంది.. ఎన్ని విత్తనాలు ఉత్పత్తి చేస్తుందో.. ఆయా వివరాలు వ్యవసాయశాఖకు అందించాలి. కానీ ఇవేవీ జోగులాంబ గద్వాల జిల్లాలో అమలు కావు. గత ఏడాది కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే వివరాలు ఇచ్చాయంటే... కంపెనీలు, ఆర్గనైజర్ల వ్యవస్థ ఏ మేరకు పాతుకుపోయిందో.. దోపిడీ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏటా వెయ్యి కోట్ల వ్యాపారం..

జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తిపై ఏటా సుమారు వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఆర్గనైజర్లు, కంపెనీలు లాభపడుతున్నాయే తప్ప... రైతులకు లాభం వచ్చిన దాఖలాలు లేవు. ఇందుకు కంపెనీలు, రైతులు ఇద్దరూ ఆర్గనైజర్ల వ్యవస్థపై ఆధారపడటమే కారణం. ఇద్దరి అవసరాలను సొమ్ము చేసుకుంటున్న మధ్యవర్తులు కోట్లకు పడగలెత్తుతున్నారు.

దళారీ వ్యవస్థను రూపుమాపాలని.. నేరుగా కంపెనీకి, రైతులకు మధ్య ఒప్పందాలు జరగాలని రైతన్నలు కోరుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విత్తన పత్తి రైతుల సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కంపెనీలు, ఆర్గనైజర్ల మోసాలపై కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీచూడండి: మరోసారి భావసారూప్యత పార్టీలవైపు కేసీఆర్​ చూపు ​

Last Updated : May 9, 2020, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.