జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. మూడురోజుల క్రితం ఎద్దుల బండ్ల ద్వారా తోలుతున్న ఇసుక రవాణాను రెవిన్యూ అధికారులు అడ్డుకోగా… ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. ఇలాగే ఉంటే తమ జీవనం కష్టమవుతుందని… ఇసుక తోలుకోవడానికి అవకాశం ఇవ్వాలని తహసీల్దారుకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. తమ కుటుంబాలను రోడ్డున పడేయవద్దని వేడుకొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
అలంపూర్ పట్టణంలో చాలా కుటుంబాలు భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. పక్కన తుంగభద్ర నది ఉన్నా ఇసుక కొరత ఉంది. ఎద్దుల బండ్ల ద్వారా ఇసుక తోలుకుంటూ నిర్మాణాలు సాగిస్తున్నారు.
ఇదీ చూడండి: Isolation: మందులు, ఆక్సిజన్, బెడ్... పేదలకు ఉచితమిక్కడ!