జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ శృతి ఓఝా, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్ష సందర్శించారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 20 పడకల చిన్న పిల్లల వార్డును పాలనాధికారి ప్రారంభించారు. అనంతరం ఎ.యన్.సి, లేబర్ వార్డులతోపాటు ఇతక వార్డులను పరిశీలించారు.
గర్భిణి స్త్రీలు నేరుగా స్ట్రెచర్ ద్వారా లేబర్ వార్డుకు వెళ్లే విధంగా బయటి నుంచి కొత్తగా మార్గమును ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రసూతి వార్డులో కొన్ని మార్పులు చేర్పులు చేసి... మరిన్ని బెడ్స్ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన నివేదిక సమర్పించటంతో పాటు... ఆసుపత్రిలో వెంటనే ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేషంట్‌తో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి కావాల్సిన చికిత్సలు అందించే విధంగా డాక్టర్లు, ఇతర సిబ్బంది బాధ్యతలు తీసుకోవాలన్నారు.