RS Praveen Kumar: తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం గడీల పాలనను అంతమొందించేందుకు అందరూ కదిలి రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మార్చి 6 నుంచి జనగామ జిల్లా ఖిలాషాపూర్ నుంచి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో పాదయాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. సుమారు 300 రోజుల పాటు 5వేల గ్రామాలలో యాత్ర చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Srinivas Goud Murder Plan : 'ఇది రాజకీయ కుట్రతో పెట్టిన కేసు'