ETV Bharat / state

'వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి' - డీకే అరుణ వార్తలు

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని భాజపా సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పంటలు, రోడ్లను ఆమె పరిశీలించారు.

dk aruna
dk aruna
author img

By

Published : Sep 22, 2020, 4:40 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని ధరూర్, జాన్​పల్లి, కోతుల గిద్ద గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లను భాజపా సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని... నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డీకే అరుణ డిమాండ్ చేశారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలన్నారు. రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​ రావు మాట్లాడటం లేదని విమర్శించారు.

ఇదీ చదవండి : మేం కట్టింది ఒక దగ్గర.. మీరు చూసింది మరో దగ్గర: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.