ఐదో మహాశక్తి పీఠమైన జోగులాంబ ఆలయాన్ని(Jogulamba Shakti Temple) చూస్తుంటే బాధ కలుగుతోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(BJP National Vice President DK Aruna) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోవెలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆలయ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెరాస హయాంలో.. దక్షిణ ప్రాంత ఆలయాలు నిరాదరణకు గురవుతున్నాయని అన్నారు.
"తెలంగాణలో ఉన్న ఏకైక శక్తి పీఠం.. జోగులాంబ అమ్మవారిది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయకపోవడం కేసీఆర్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనం. దక్షిణ ప్రాంత ఆలయాలన్ని వివక్షకు గురవుతున్నాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ శక్తిపీఠాన్ని దర్శించుకునేందుకు చాలా మంది పర్యాటకులు వస్తారు. వారికి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఆలయం నిరాదరణకు గురవడం చూస్తుంటే చాలా బాధేస్తోంది."
- డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు
జోగులాంబ శక్తి పీఠాన్ని(Jogulamba Shakti Temple) దర్శించుకున్న డీకే అరుణ(BJP National Vice President DK Aruna).. తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ కనీస ఆదరణకు నోచుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా సర్కార్ దృష్టి సారించి అమ్మవారి ఆలయానికి పునర్వైభవం తీసుకురావాలని కోరారు. నవరాత్రి ఉత్సవాల్లో చంద్రఘంటాదేవి అలంకారంలో కనువిందు చేసిన అమ్మవారిని అరుణ(BJP National Vice President DK Aruna) దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించి.. అమ్మవారి కోవెల(Jogulamba Shakti Temple)లో దీపారాధన చేశారు. అనంతరం అర్చకులు డీకే అరుణ(BJP National Vice President DK Aruna)కు తీర్థప్రసాదాలు అందజేశారు.